June 15, 2026
Explore
ఎర్రగుంట్ల రైల్వే యార్డులో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య..!

ఎర్రగుంట్ల రైల్వే యార్డులో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య..!

June 15, 2026 | Andhra Pradesh

ఎర్రగుంట్ల ముచ్చట్లు:

వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ యార్డు ప్రాంతంలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే యార్డులో ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు.

మృతుడి పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు ఇంకా గుర్తించలేక పోయామని, అతడిని గుర్తించేందుకు ప్రజల సహకారం అవసరమని రైల్వే పోలీసులు కోరారు.

మృతుడి గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు.

Tags: Unidentified person commits suicide at Yerraguntla railway yard!