అమరావతిముచ్చట్లు:
హిందూ ధర్మంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంవత్సరం సోమావతీ అమావాస్య ఈ నెల 15వ తేదీన రానుంది. అమావాస్య, జ్యేష్ఠ అధిక మాసం కలిసి రావడం వల్ల ఒక అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది.దాదాపు మూడేళ్ల కాలానికి ఒకసారి సంభవించే ఈ విశిష్ట సందర్భం, పితృ తర్పణాలకు, దానధర్మాలకు, హరిహరుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. సోమవారం నాడు అమావాస్య రావడం, అది అధిక మాసంలో ఉండటం వల్ల దీని ప్రాధాన్యత మరింత పెరిగింది.
జ్యేష్ఠ అధిక మాస అమావాస్య తిథి 14న మధ్యాహ్నం 12:19 నిమిషాలకు ప్రారంభమై, 15న ఉదయం 8:23 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథిని ప్రామాణికంగా తీసుకుని జూన్ 15న సోమవతి అమావాస్యను జరుపుకోవడం ఆచారం. ఈ రోజున చేసే స్నానం, పూజలు, పితృ కార్యాలు అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆధ్యాత్మిక ఆచారాలతో పాటు కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. నువ్వులతో కలిపిన పిండితో రొట్టెలు చేసి ఆవులకు తినిపించడం, చేపలకు పిండి ముద్దలను వేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సాయంత్రం వేళ ఇంటి ఈశాన్య మూలలో ఎరుపు దారం వత్తితో దీపం వెల.
Tags: Today is Somavati Amavasya: Things to do…