June 15, 2026
Explore
సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి

సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి

June 15, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం మదనపల్లెలో మీడియాకు తెలిపారు. ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఎన్నికలు ఈ నెల 13, 14 తేదీలలో విజయవాడలో నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం పలమనేరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న తనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల అధికారి బాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెంకటరమణారెడ్డి వెల్లడించారు. సంఘం అభివృద్ధి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Tags: Venkataramana Reddy appointed as State President of the Survey Employees’ Association.