June 14, 2026
Explore
భారత కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

భారత కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

June 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ను కేంద్రప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీకాలం జూన్ 30న ముగుస్తుంది. ఆ రోజే ఆర్మీ చీఫ్ గా ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీకాలం 3 సంవత్సరాలు లేదా ఆయనకు 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు..ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సేవలందిస్తున్నారు. ఖడక్ వాస్లాలోని ప్రతిష్టాత్మక ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’ పూర్వ విద్యార్థి. డిసెంబర్ 1986లో ఆయన భారత సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత సైన్యానికి సేవలందిస్తున్నారు. ఆయన విస్త్రతశ్రేణి కమాండ్, స్టాఫ్, వ్యూహత్మక బాధ్యతలు నిర్వహించారు. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ గతంలో సాయుధ రెజిమెంట్కు, సాయుధ బ్రిగేడ్ తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్ పనిచేశారు. ప్రతిష్టాత్మక సుదర్శన్ చక్ర కార్న్స్ కు నాయకత్వం వహించారు. దిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ జీవోసీగా పనిచేశారు.

Tags: Lieutenant General Dhiraj Seth appointed as India’s new Army Chief.