దేవీపట్నం ముచ్చట్లు:
ఏపీలోని పాపికొండల యాత్ర నేటి నుంచి తాత్కాలికంగా నిలిచిపోనుంది. తనిఖీల దృష్ట్యా పర్యాటక బోట్లను నిలిపేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీఓ స్వాతి తెలిపారు. దీంతో ఒక ఏపీ టూరిజం, మరియు 15 ప్రైవేట్ బోట్లు నిలిచిపోనున్నాయి. ఇటీవల దేవీపట్నం వద్ద 89 మంది పర్యాటకులతో బయల్దేరిన బోటు గోదావరి మధ్యలో సాంకేతిక లోపాలతో నిలిచిపోయింది. ఐతే తరచూ ఇలాంటి సమస్యలే వస్తుండటంతో బోట్ల భద్రత పై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తనిఖీలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Tags: Papikondalu tour suspended from today.