June 14, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం

June 14, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం, ఈడిగపల్లి చెక్‌పోస్ట్ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లికి చెందిన రామారావు కాలనీ నివాసులు షేక్ అమీర్,45సం:ఆయన భార్య సల్మా40సం: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.బంధువుల కథనం ప్రకారం, ఈడిగపల్లిలో ఓ వైద్యుడిని కలిసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు.

Tags: Couple killed in road accident