తిరుపతి ముచ్చట్లు:
- సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లపై అవగాహన కల్పించిన శక్తి టీమ్
- మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, అత్యవసర సహాయ నంబర్లపై చైతన్యం
- విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, జాబ్ ఫ్రాడ్‌లపై సూచనలు
- చిన్నారులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల భద్రతపై అవగాహన
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సైబర్ నేరాలతో పాటు నేటి సమాజంలో జరుగుతున్న వివిధ రకాల నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో శక్తి టీమ్ సిబ్బంది విద్యార్థులు, మహిళలు, చిన్నారులను చైతన్యపరిచారు.
చింతలచేను గ్రామంలో నిర్వహించిన గ్రామ సమావేశంలో శక్తి యాప్, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, మహిళల అక్రమ రవాణా, మహిళలపై నేరాలు, గృహహింస, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలల అపహరణ, బాలలపై వేధింపులు, తెలియని లింకుల ప్రమాదాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, అత్యవసర టోల్ ఫ్రీ నంబర్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మహిళలు, చిన్నారులపై ఇటీవల సమాజంలో చోటుచేసుకున్న ఘటనలు మరియు కేస్ స్టడీల ద్వారా ప్రజలకు వివరించారు.
మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులకు శక్తి యాప్ డౌన్‌లోడ్ మరియు వినియోగం, లోన్ యాప్ మోసాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, సెల్ ఫోన్ మరియు సోషల్ మీడియా దుష్ప్రభావాలు, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు, అత్యవసర సహాయ నంబర్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అవిలాల ఎస్.ఆర్. డిఫెన్స్ కళాశాలలో విద్యార్థులకు శక్తి యాప్, లోన్ యాప్ మోసాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, తెలియని లింకులు మరియు వీడియో కాల్స్ ద్వారా జరిగే మోసాలు, సెల్ ఫోన్ మరియు సోషల్ మీడియా దుష్ప్రభావాలు, జాబ్ ఫ్రాడ్‌లు, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, మంచి స్నేహాలు, సత్ప్రవర్తన, మంచి అలవాట్లు, చైల్డ్ పోర్నోగ్రఫీ, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్, మాదకద్రవ్యాల ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు అత్యవసర సేవల నంబర్లపై అవగాహన కల్పించారు.
చిన్నారులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలల అదృశ్యం, బాలల అపహరణ, బాలలపై వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల దుష్పరిణామాలు, మొబైల్ గేమ్స్ ప్రభావం, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత, క్రమశిక్షణ, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, విద్య ప్రాముఖ్యత, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను గౌరవించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన కేస్ స్టడీలను వివరించి, అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ల గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా శక్తి టీమ్ సిబ్బంది మాట్లాడుతూ, సైబర్ నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద ఘటన గమనించిన వెంటనే పోలీసులకు లేదా 112 అత్యవసర సహాయ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
Tags: Awareness regarding cybercrimes, loan app scams, and digital arrests.