పుంగనూరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పుంగనూరులోని ఓ మెడికల్ షాపులో నిషేధిత మత్తు మందుల విక్రయం జరుగుతున్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసపురంలో మత్తు మందులతో పట్టుబడిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు కోలార్ ట్రైనీ ఎస్పీ కన్నికా సిక్రివాల్, డీఎస్పీ మనీష్ ఆధ్వర్యంలో గణేశ్ మెడికల్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని అనుమానాస్పద మందులను స్వాధీనం చేసుకుని షాపు యజమాని విశ్వనాథ్‌ను అదుపులోకి తీసుకుని శ్రీనివాసపురానికి తరలించారు. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులకు ముందస్తు సమాచారం లేదని సీఐ సుబ్బరాయుడు తెలిపారు.
Tags: Karnataka police raid medical shop in Punganur.