June 13, 2026
Explore
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

June 13, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని రాయచోటి, మాసాపేట సబ్ స్టేషన్ల పరిధికి సంబంధించి విద్యుత్ సరఫరాలో నేడు అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ శాఖ ఈస్ట్ సెక్షన్ ఏఈ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 కెవి ఫీడర్ మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. రాయచోటి సబ్ స్టేషన్ పరిధిలోని సుండుపల్లె రోడ్డు ఫీడర్, మాసాపేట సబ్ స్టేషన్ పరిధిలోని మాసాపేట ఫీడర్ లకు సంబంధించి పలు ప్రాంతాలలో సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

Tags: Power supply interruption today