June 13, 2026
Explore
17 కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలకు సరుకుల సరఫరా టెండర్లు

17 కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలకు సరుకుల సరఫరా టెండర్లు

June 13, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లాముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని 17 కస్తూర్బా బాలికల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, వసతి గృహాలకు కూరగాయలు, అరటిపండ్లు, చికెన్ సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అనురాధ తెలిపారు. దరఖాస్తు ఫీజుగా రూ.5 వేల డీడీ, బిడ్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.50 వేల డీడీ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. జూన్ 22న జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో టెండర్లను తెరవనున్నట్లు వెల్లడించారు.

Tags; Annamayya: Tenders for supplying goods to Kasturba and Model Schools (17)