గుంటూరు ముచ్చట్లు:
ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
గుంటూరులోని లాడ్జి సెంటర్లో డీఎస్సీ దిష్టిబొమ్మను పోలీసులు అడ్డుకోగా టిడిపి మేనిఫెస్టోను కాల్చి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఏసురత్నం,మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ
అంబటి రాంబాబు కామెంట్స్..
చంద్రబాబు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.
సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ ను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు.
సూపర్ సిక్స్ పథకంలో ముఖ్యంగా స్త్రీ నిధి పథకం 1500 రూపాయలు ఇస్తానని స్త్రీలను మోసం చేశారని విమర్శించారు.
నారా లోకేష్ యువగళం యాత్రలో నిరుద్యోగులకి ప్రతినెల 3వేలు రూపాయలు ఇస్తామని దగా చేశారని దుయ్యబట్టారు.
బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలకు 50 సంవత్సరాలు నిండితే ఫెన్షన్ ఇస్తామని మహిళలను వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు.
మహిళల అక్రమ రవాణా జరిగిందని గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మెదపటం లేదని ప్రశ్నించారు.
సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రపంచ మోసగాడని,యువగళంలో హామీలిచ్చిన నారా లోకేష్ ఆల్ ఇండియా మోసగాడని, పవన్ కళ్యాణ్ ఆంధ్ర మోసగాడాని ఎద్దేవా చేశారు.
ముగ్గురు మోసగాళ్లు కలిసి ఆంధ్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పుడు కూడా మోసం చేశాడని గుర్తుచేశారు.
డిఎస్సి వాళ్ల దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 30 లక్షలు చొప్పున లోకేష్ తీసుకున్నారని ఆరోపించారు.
గుజ్జనగుంట్లలో డీఎస్సీలో జరిగిన అవకతవకులపై వైసిపి నిరసన చేపడుతుంటే పోలీసులు అడ్డుకున్నారని..
గుజ్జనగుండ్ల వద్ద వైసిపి నిరసన చేస్తుంటే అదే సమయంలో టిడిపి వాళ్లు జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను తకలేస్తుంటే, పోలీసులు దగ్గరుండి కాపలా కాసారని విమర్శించారు.
తన ఇంటి పై దాడి చేసిన వారిని ఇంతవరకు అరెస్టు చేయలేదని గుర్తు చేశారు.
తన ఇంటి పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిజిపి కి వినతి పత్రం ఇచ్చేందుకు జూలై 29వ తేదీన తన ఇంటి వద్ద నుండి డిజిపి కార్యాలయం వరకు వినతి పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.
Tags: Ambati Rambabu’s anger