కోల్‌కతాముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం సంభవించింది. అలీపుర్‌లోని తొమ్మిది అంతస్తుల ప్రభుత్వ భవనంలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భవనంలో భద్రపరిచిన సుమారు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు చెందిన ఓటింగ్ కోసం ఈ యంత్రాలనే ఉపయోగించినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
Tags: Massive fire in Kolkata: 4,000 EVMs gutted.