June 12, 2026
Explore
భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

June 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.2,940 పెరిగి ₹1,48,580 మార్కుకు చేరింది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,700 ఎగబాకి ₹1,36,200 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో స్థానిక పన్నులను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

Tags: Gold prices have risen sharply.