June 12, 2026
Explore
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు

June 12, 2026 | Andhra Pradesh


-తృటిలో తప్పిన పెను ప్రమాదం

మదనపల్లె టౌన్ ముచ్చట్లు:

బెంగళూరు నుంచి ప్రయానీకులతో మదనపల్లె కు వస్తున్న SLT బస్సు కర్ణాటకలో ట్రాక్టర్‌ను ఢీకొంది. తృటిలో పెను ప్రమాదం తప్పిన ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్ణాటకలోని సునకల్లుకు చెందిన రైతు రెడ్డెప్ప తన మామిడి తోటలో కాయలు కోయించి తన ట్రాక్టర్‌లో శ్రీనివాసపురంలోని మార్కెట్‌కు గంగడు, కిట్టలతో పంపించారు. వారు కాయలు మార్కెట్‌లో దింపి తిరిగి ఇంటికి వస్తుండగా, మంచినీళ్లకోట వద్ద బెంగళూరు నుంచి వస్తున్న SLT బస్సు ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తాపడి గంగడు, కిట్టలు తీవ్రంగా గాయపడ్డారు. బాదితులను శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని అక్కడి పోలీసులు తెలిపారు..

Tags: SLT bus rams into tractor