పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, బ్యాగులు , వివిధ సామాగ్రీని శుక్రవారం ఎంఈవోలు పంపిణీ చేశారు. కొత్తయిండ్లు మున్సిపల్ హైస్కూల్, బసవరాజ హైస్కూల్‌లో ఎంఈవోలు నటరాజారెడ్డి, రెడ్డెన్నశెట్టి లు కలసి పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వ పరంగా అందించే పుస్తకాలు, బెల్టులు, బ్యాగులు , షూ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ రమణతో పాటు ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

Tags; Distribution of books and bags to students