పుంగనూరుముచ్చట్లు:
ప్రజలు తమ ఇండ్ల పరిసరాలలో గల దోమలను నివారిస్తే మలేరియా జ్వరాలను అరికట్టేందుకు వీలుందని యూనిట్ అధికారి గంగయ్య తెలిపారు. శుక్రవారం పట్టణంలోని తేరువీధి పిహెచ్‌సి నుంచి సిబ్బందితో కలసి అవగాహన ర్యాలీని నిర్వహించారు. మురుగునీటి నిల్వలను తొలగించి, అబేట్ ద్రావణాన్ని పిచికారి చేయాలని సూచించారు. దోమల వలన వివిధ రకాల జ్వరాలు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు వహించాలని కోరారు.
Tags: Mosquito control measures must be taken.