మాజీ ఎంపీ రెడ్డెప్ప
పుంగనూరుముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఒకమాట , పదవి రాగానే మరోక మాట చెబుతూ ప్రజలను మోసగిస్తుండటంపై వైఎస్సార్‌సిపి తిరుగుబాటు జెండా ఎగురవేసిందని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలో బాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమ ర్యాలీకి నియోజకవర్గం నుంచి వేలాది మంది పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జాడ కనిపించలేదన్నారు. కేవలం అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టిన చంద్రబాబు ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో విఫలమైయ్యారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్-6 హామీలు ఒక్కటైన అమలు చేశారా అంటు నిలధీశారు. ప్రజలు రెండేళ్లకే బాబు పాలనలో హత్యలు, అత్యాచారాలు, ఆక్రమణలతో విసిగిపోయారని ఎద్దెవా చేశారు. దగా డిఎస్సీ తో నిరుద్యోగులను మోసం చేసి , వారి జీవితాలతో చలగాటం ఆడుతున్నారని మండి పడ్డారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. టీటీడీ బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలే మిగిలిందని, కనీసం సంక్షేమ పథకాలు కూడ అందించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు కూడ పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించారు. అమ్మ ఒడి, మహిళలకు నెలనెల రూ.1500లు ఎప్పుడు ఇస్తారని నిలధీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, అమరావతి సంక్షేమాన్ని మాత్రమే కాంక్షిస్తోందని ఎద్దెవ చేశారు. ఈసమావేశంలో వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము , రాష్ట్ర గిరిజన సంఘ ప్రధాన కార్యదర్శి మునీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Banner of revolt against Babu’s backstabbing regime.