-బాబుకు వ్యతిరేక నినాదాలు
- భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు
పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమంపై వెఎస్సార్‌సిపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పుంగనూరు నియోజవర్గ కేంద్రంలో నిరసన ర్యాలీ విజయవంతమైంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, ఎంపిపిలు భాస్కర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, ఈశ్వరయ్య, జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి , రెడ్డిశ్వర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్బోర్టు మాజీ చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో వేలాది మంది పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్‌కు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రైవేటు బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని, ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు వెన్నుపోటుతో సూపర్-6 గోవిందా… ఇదేమిరాజ్యం… దొంగలరాజ్యం….దోపిడిరాజ్యం అంటు నినాదాలు చేశారు. అలాగే వైఎస్సార్‌సిపి జిందాబాద్…జగనన్న జిందాబాద్ పెద్దిరెడ్డి జిందాబాద్…మిధున్‌రెడ్డి జిందాబాద్ అంటు నినాదాలతో హ్గరేత్తించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి,ఉమ్మడి జిల్లాల ఐటివింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయరామిరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రమణ, పార్టీ కన్వీనర్లు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, కరీముల్లా, నాదమునిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్‌బాబు , విద్యార్థి విభాగం కార్యదర్శి కళ్యాణ్‌భరత్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, యువజన నాయకులు రాజేష్, సురేష్, రామకృష్ణారెడ్డి, కంచి,సుబ్రమణ్యం, మనోజ్‌కుమార్‌నాయక్, వాసునాయక్, డాబాశీను నాయక్, అంజినాయక్, వేణునాయక్ తదితరులు పాల్గొన్నారు.





Tags;Babu’s ‘Two Years of Backstabbing’ protest rally a success.