June 12, 2026
Explore
రెండేళ్ల వెన్నుపోటులో ముస్లిం ఓట్లు తొలగించే కుట్ర

రెండేళ్ల వెన్నుపోటులో ముస్లిం ఓట్లు తొలగించే కుట్ర

June 12, 2026 | Andhra Pradesh

ముస్లింల తిరుగుబాటుకు శ్రీకారం

పుంగనూరుముచ్చట్లు:

చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు ఒరిగిందేమి లేదని , ఎస్‌ఐఆర్‌ పేరుతో ముస్లింల ఓట్లు తొలగించే కుట్ర పన్నుతున్నారని ముస్లింలు ఐకమత్యంతో పోరాటం చేయాలని ముస్లిం నాయకులు అలీమ్‌బాషా, ఫకృద్ధిన్‌షరీఫ్‌, అమ్ము లు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో ముస్లింలు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో పథకం ప్రకారం మైనార్టీల అణచివేతకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో 70 సంవత్సరాల క్రితం పుట్టిన తేదీలు కావాలని, 2002 సంవత్సరం ఓటర్ల జాబితా డిమాండ్‌ చేయడం బాధకరమన్నారు. ప్రజల వద్ద ఓటర్ల జాబితా ఎందుకు ఉంటుందని నిలధీశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆధార్‌ను పరిగణలోనికి తీసుకోకుండ నిజాయితీగా నివాసం ఉన్న ముస్లిం ఓటర్లను తొలగించే కుట్రలో ఇలాంటి రికార్డులు కావాలని పేర్కొనడం , ఓట్లు తొలగించేందుకు మార్గమౌతోందని ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్రంలోని ముస్లింలు అందరు ఐకమత్యంగా తమ ప్రాంతాల్లోని మసీదులలో సమావేశాలు నిర్వహించి, ముస్లింలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఒక్క ఓటు తొలగించకుండ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పథకం ప్రకారమే వైఎస్సార్‌సిపికి అండగా ఉన్న ముస్లిం ఓట్లను తొలగించే కుట్రలు సాగుతోందని తెలిపారు. ఈ విషయంలో ముస్లింలు రాజీపడే ప్రసక్తే లేదని , ఓట్లు తొలగిస్తే వీధి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ముస్లిం నాయకులు ఎంఎం.సాధిక్‌, ఖాన్‌, అంజాద్‌, మమ్ము, ఇంతియాజ్‌, బావాజాన్‌, మహబూబ్‌బాషా, అజీజ్‌, అస్లాంమురాధి, ఖాజా, షాహిద్‌, గౌస్‌, నజీర్‌, అమ్ముకుట్టి, అష్రప్‌, ఆసిప్‌, ఆయాజ్‌, నయాజ్‌, రేష్మా, సాజిదాబేగం, రషీద తదితరులు పాల్గొన్నారు.

Tags: A conspiracy to remove Muslim votes in a two-year backlash