June 12, 2026
Explore
సత్తెనపల్లి వద్ద రైలు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

సత్తెనపల్లి వద్ద రైలు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

June 12, 2026 | Andhra Pradesh

సత్తెనపల్లి ముచ్చట్లు:

సత్తెనపల్లి–అచ్చంపేట రహదారిలోని రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం జరిగింది.

స్థానికుల సమాచారంతో 108 వాహనంలో అతడిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అనంతరం రైల్వే పోలీసులు విచారణ చేపట్టి, క్షతగాత్రుడిని తెనాలికి చెందిన పాముల ఆనంద్ (23)గా గుర్తించారు.

ఈ ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ రాజమోహనరావు తెలిపారు.

Tags: Youth critically injured after being hit by a train near Sattenapalli.