తిరుపతి ముచ్చట్లు:
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ తిరుపతిలో ‘సంక్షేమం’ పేరిట భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, ఏపీ బీజేపీ చీఫ్ పి.వి.ఎన్. మాధవ్ హాజరుకానున్నారు. రెండేళ్ల ప్రభుత్వ విజయాలను ఇందులో ప్రజల ముందు ఉంచనున్నారు. నిజానికి ఈనెల 9నే ఈ సభను నిర్వహించాల్సి ఉండగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం కారణంగా వాయిదా వేశారు.
Tags: Coalition meeting in the name of ‘welfare’ today in AP