June 12, 2026
Explore
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఎస్‌ఎల్‌టీ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఎస్‌ఎల్‌టీ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

June 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

బెంగళూరు నుంచి మదనపల్లెకు ప్రయాణికులతో వస్తున్న ఎస్‌ఎల్‌టీ బస్సు కర్ణాటకలో ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, సునకల్లుకు చెందిన రైతు రెడ్డెప్ప మామిడి కాయలను మార్కెట్‌లో దించి తిరిగి వస్తున్న ట్రాక్టర్‌ను మంచినీళ్లకోట సమీపంలో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.

ప్రమాదం కారణంగా ట్రాక్టర్ బోల్తాపడగా అందులో ఉన్న గంగడు, కిట్టలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు.

Tags: SLT bus rams into tractor; major accident narrowly averted.