టి.సుండుపల్లి ముచ్చట్లు:
టి.సుండుపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నారాయణి రకం వేరుశనగ విత్తనకాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ సాగు దృష్ట్యా నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 75 క్వింటాళ్ల విత్తనకాయలను 250 బ్యాగుల రూపంలో పంపిణీ చేయగా, ఒక్కో బ్యాగులో 30 కిలోల విత్తనాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా సుమారు 200 మంది రైతులు లబ్ధి పొందారు.
కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత రామ శ్రీనివాస్ రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎ. శ్రీకాంత్ మాట్లాడుతూ ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను వినియోగించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రామ శ్రీనివాస్ సూచించారు.
Tags: Distribution of Narayani variety groundnut seeds to farmers.