కలికిరిముచ్చట్లు:
కలికిరిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కలకడ మార్గంలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో చిన్నమండెం మండలానికి చెందిన కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కలికిరి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Horrific road accident in Kalikiri; female farm worker from Chinnamandem dies.