June 11, 2026
Explore
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు

June 11, 2026 | Andhra Pradesh

: ఏపీ జేఏసీ అమరావతి

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలోని ఎన్జీవో హోంలో గురువారం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా అమలు చేయలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

జిల్లా అధ్యక్షుడు నరసింహ కుమార్ మాట్లాడుతూ డీఏ, పీఆర్సీ, ఎస్‌ఎల్ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ అమలు చేయాలని, ఉద్యోగుల బకాయిలను పేస్లిప్‌లో చూపించాలని, ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

Tags; An agitation is inevitable if employees’ issues are not resolved.