పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని ముడిబాపనపల్లె పిహెచ్‌సిని మలేరియా అధికారి రామచంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం ఆయన సిబ్బంది పనితీరు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరాతీశారు. అలాగే ఆసుపత్రిని తనిఖీ చేసి , సిబ్బందికి పలు విషయాలపై సూచనలు చేశారు. ఈయన వెంట మెడికల్ ఆఫీసర్ పవన్‌కుమార్, ఎంపిహెచ్‌ఈవో మురళి, సిబ్బంది పాల్గొన్నారు.
Tags; Malaria officer inspected the PHC.