పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణంలోని స్థానిక M.R.O కి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పుంగనూరు అసెంబ్లీ కమిటీ కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యూసుఫ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ చేపట్టిన SIR 2026 MAPPING కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లా, ప్రతి మండలం లో జరుగుతున్నది.ఇందులో భాగంగా ఎస్‌డిపిఐ పార్టీ తరఫున HELP DESK (సహాయక కేంద్రాలు) లును ఏర్పాటు చేసి 2002 లిస్టులో పేర్లును వెతికి ఇవ్వడంలో , వారి యొక్క మ్యాపింగ్ ఏ విధంగా చేసుకోవాలో చెప్పడంలో మన పార్టీ కార్యకర్తలు సహాయ పడుతున్నారూ. ఇందుల వస్తున్న ప్రధాన సమస్య ఏమిటి అంటే. SIR 2002 లో సంవత్సరం లిస్ట్ లో తమ పేర్లు ఉంటే వారి యొక్క మ్యాపింగ్ సులవుగా అవ్వబడతా ఉంది. 1995 Voter card ఉండి 2002 లిస్టులో పేరు లేని వారు , పేరులో మార్పులు ఉన్నా అవి మ్యాపింగ్ కావడం లేదు .ఇలాంటి అనేక రకాల సమస్యలను యి రోజు MRO దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. దీనికి గాను సానుకూలంగా స్పందించి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వ అధికారులు ( BLO ) తమ ఇంటింటికి వచ్చినప్పుడు ప్రభుత్వం గుర్తించిన రెండు సర్టిఫికెట్లను సబ్మిట్ చేస్తే చాలు తెలిపారు, కావున ఎవరు భయ పడాల్సిన అవసరం లేదు.. ప్రజలకు SIR గురించి ఎలాంటి ప్రశ్నలున్న, సమస్యలున్న ఎస్‌డిపిఐ పార్టీ ముందుండి సహాయ పడుతుందని మరియు పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యూసుఫ్. జాబివుల్లా.యూనుస్.సిద్దిక్. అసిఫ్. షామీర్.రాయల్ బాబా. చాంద్ బాషా. ఇమ్రాన్. షహీద్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Tags:Help center set up by the SDPI party.