June 11, 2026
Explore
12న వైఎస్సార్‌సిపి ర్యాలీకి తరలిరండి

12న వైఎస్సార్‌సిపి ర్యాలీకి తరలిరండి

June 11, 2026 | Andhra Pradesh

మాజీ ఎంపి రెడ్డెప్ప పిలుపు

పుంగనూరుముచ్చట్లు:

వెఎస్సార్‌సిపి పిలుపు మేరకు నియోజకవర్గకేంద్రమైన పుంగనూరులో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ర్యాలీకి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు తరలిరావాలని మాజీ ఎంపి రెడ్డెప్ప పిలుపునిచ్చారు. గురువారం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఎంపిపి భాస్కర్‌రెడ్డితో కలసి ఆయన సీఐ సుబ్బరాయుడుకు వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని బస్టాండ్‌లో గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి , అక్కడి నుంచి ర్యాలీ శాంతియుతంగా అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు నిర్వహిస్తామని, తహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఈ మేరకు తమకు అనుమతి మంజూరు చేసి సహకరించాలని కోరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గ కేంద్రంలో నిరసన రాష్ట్ర స్థాయికి తెలియజేసేందుకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి, జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కన్వీనర్లు ఇర్ఫాన్‌, అమరనాథరెడ్డి, అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Turn out for the YSRCP rally on the 12th.