June 11, 2026
Explore
ఓటర్ల జాబితాను పారదర్శకంగా నిర్వహించాలి

ఓటర్ల జాబితాను పారదర్శకంగా నిర్వహించాలి

June 11, 2026 | Andhra Pradesh

డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి

పుంగనూరుముచ్చట్లు:

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్‌ పక్రియను ప్రతి ఒక్కరు సమర్థవంతంగా , పారదర్శకంగా నిర్వహించి, ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి బిఎల్‌వోలను ఆదేశించారు. గురువారం స్థానిక జెడ్పి అతిధి గృహంలో నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలకు చెందిన తహశీల్ధార్లు, బిఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. డిఆర్‌వో మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఎస్‌ఐఆర్‌ విధి విధానాలను వివరించి, ఓటర్ల సేకరణ, కొత్త ఓటర్ల నమోదు నిర్వహించాలన్నారు. మార్పులు, చేర్పులపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఏ ఒక్క ఓటరు మిస్‌ కాకుండ నమోదు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు 75 శాతం నిర్వహించారని, మిగిలిన 25 శాతం నమోదు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు ఉండరాదని , నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి, తహశీల్ధార్లు రాము, పార్వతి మధుసూదన్‌, పాములేటి, ప్రమీల, బిఎల్‌వోలు పాల్గొన్నారు.

Tags: The voters’ list must be maintained transparently.