మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి మండలంలోని మాలేపాడు గ్రామంలో బుధవారం దారి సమస్య మళ్లీ మొదటికొచ్చింది. అధికార టీడీపీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరడంతో, ఒకరిపై మరొకరు పోటీపడి 13 పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారిని పూర్తిగా మూసేశారు. రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద చెట్ల మొద్దులు, ముళ్లకంపలు వేసి రాకపోకలను స్తంభింపజేశారు.దీంతో ఆయా గ్రామాలకు చెందిన పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాధిత ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజకీయ వర్గపోరుతో తమను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే స్పందించి, ఈ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్తులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags; Road issue in Malepadu: Road blocked with thorny bushes.