రామాపురం ముచ్చట్లు:
రామాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం రామాపురం పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, మందుల నిల్వలు, లేబర్ రూమ్, ఆక్సిజన్ ప్లాంట్ నిర్వహణను నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు, వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. లేబర్ రూమ్‌లో ప్రోటోకాల్స్ పాటిస్తూ, పరికరాలను స్టెరిలైజేషన్ చేసి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సబ్‌సెంటర్ల వారీగా వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించి, కనీసం 90 శాతానికి పైగా లక్ష్యాలను సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పీహెచ్‌సీ పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి సేవలు అందుతున్న తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Tags: Quality of services in PHCs must improve: Collector