సుండుపల్లి ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్’ కార్యక్రమం గర్భిణులకు ఒక వరం లాంటిదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు పేర్కొన్నారు. సుండుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పథకం 10 సంవత్సరాలు, 100 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గర్భిణులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేష్ నాయుడు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా గర్భిణులకు ఉచిత వైద్య సేవలతో పాటు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. గర్భిణులు దూర ప్రాంతాలకు వెళ్లి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోకుండా, స్థానిక ప్రభుత్వాసుపత్రిలోనే అందుబాటులో ఉన్న మహిళా వైద్యుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆసుపత్రి ప్రధాన వైద్యులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతినెల 9, 10 తేదీల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ సంయుక్త అందుబాటులో ఉండి గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు, చికిత్స అందిస్తారని తెలిపారు. కాగా, రాయవరం, బి.జి.రాచపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గర్భిణులకు భోజన సౌకర్యం కల్పించారు.
Tags: The ‘Pradhan Mantri Surakshit Matritva Abhiyan’ is a boon for pregnant women.