సుండుపల్లి ముచ్చట్లు:
సుండుపల్లి సచివాలయం సమీపంలోని సుండుపల్లెమ్మ ఆలయ ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని రెవెన్యూ అధికారులు బుధవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఆలయ పునరుద్ధరణ, ఉత్సవాల నిర్వహణపై మరో వర్గం వారు అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్ఐ హుస్సేన్ ఈ చర్యలు తీసుకున్నారు. పూజల కోసం టెంకాయ పట్టల పందిరి వేయరాదని, అవసరమైతే షామియానా వేసుకోవాలని ఎస్ఐ సూచించారు. పూజలకు ముందు సమాచారం ఇస్తే అడ్డంకులు లేకుండా చూస్తామని అధికారులు తెలిపినట్లు బీజేపీ నాయకులు రమణ గౌడ్, నాగేశ్వర రావు పేర్కొన్నారు.
Tags: No construction work to be undertaken at the temple: Board of officials