మదనపల్లి ముచ్చట్లు:
ఓటర్ల పరిశీలనలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ సుండుపల్లి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు కోరారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ సమావేశాలకు నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.సచివాలయాల్లో సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేస్తే తన దృష్టికి తేవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని పార్టీ బీఎల్ఏలు కచ్చితంగా బీఎల్ఓల వెంట వెళ్లి ఓట్ల మ్యాపింగ్ సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు.
Tags: Attendance at party meetings is mandatory: Ramesh Naidu