సత్ప్రవర్తనతో మెలగకుంటే చర్యలు తప్పవు
సీఐ. సుబ్రహ్మణ్యం
ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని ఇబ్రహీంపట్నం సి ఐ.సుబ్రమణ్యం హెచ్చరించారు. రౌడీ షీటర్లు అల్లర్లు, అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని రౌడీ షీటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనతో మెలగాలని కఠినంగా హెచ్చరించారు .రౌడీ షీటర్ల కదలికలపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ. సుబ్రహ్మణ్యం, ఎస్.ఐ లు సత్యవతి,చక్రధర్, శ్రీను మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Counseling for Rowdy-sheeters in Ibrahimpatnam