June 11, 2026
Explore
జిల్లా నూతన ఆర్‌ఐగా రంగనాథ్‌ బాబు బాధ్యతల స్వీకరణ

జిల్లా నూతన ఆర్‌ఐగా రంగనాథ్‌ బాబు బాధ్యతల స్వీకరణ

June 11, 2026 | Andhra Pradesh

:- ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లిని ని కలిసిన నూతన అధికారి..

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా నూతన రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా యు. రంగనాథ్ బాబు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మదనపల్లెలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ కి పూలమొక్కను అందజేసి నూతన బాధ్యతల స్వీకరణపై నివేదించారు. 2013 బ్యాచ్‌కు చెందిన యు. రంగనాథ్ బాబు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన సర్వీసులో భాగంగా కర్నూలు జిల్లాతో పాటు గుంతకల్ రైల్వే విభాగంలోనూ వివిధ హోదాల్లో సమర్థవంతమైన సేవలు అందించారు. ఇటీవల రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన, బదిలీపై అన్నమయ్య జిల్లాకు విచ్చేసి నేడు బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నూతన ఆర్‌ఐకి అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ , విధి నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అంతర్గత క్రమశిక్షణను కాపాడటంలో రిజర్వ్ పోలీస్ బలగాల పాత్ర అత్యంత కీలకమైనదని ఎస్పీ స్పష్టం చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ బాబు తన అనుభవంతో జిల్లాలోని పోలీస్ సిబ్బందిని సమర్థవంతంగా సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. సిబ్బందిలో నిరంతరం వృత్తిపరమైన నైపుణ్యాలను, క్రమశిక్షణను పెంపొందిస్తూ, ప్రజా రక్షణే ధ్యేయంగా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు.

Tags:Ranganath Babu assumes charge as the new District RI.