పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని తాటిమాకులపాళెంలో గల కౌండిన్య నది కాలువలో పేరుకుపోయిన జమ్ముగడ్డిని , మురుగుమట్టిని మున్సిపల్ కార్మికులు తొలగించారు. బుధవారం కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌండిన్యనది కాలువ పనులను జెసిబిలతో తొలగించారు. కూరుకుపోయిన మట్టిని , చెత్తను కంపోస్ట్ యార్డుకు తరలించారు. కాగా క్లీన్‌స్వీప్ కార్యక్రమంలో పట్టణంలోని ప్రతి పెద్ద, చిన్న కాలువలను , వీధులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే కార్యక్రమం చేపడుతున్నామని, పుంగనూరు క్లీన్ మున్సిపాలిటిగా ఉండేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.
Tags; Sanitation works in the Kaundinya River canal.