పుంగనూరుముచ్చట్లు:
మండల పరిధిలోని రాగానిపల్లెలో ఓ వ్యక్తి ఉరి వేసుకు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాగానిపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి (67) అనుమానస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి మరణానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
Tags; Man dies by hanging