పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని యూబికాంపౌండులో నివాసం ఉంటున్న 29 ఏళ్ల వివాహిత కుటుంబ కలహాల కారణంగా బుధవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం అహ్మద్‌బాషాతో వివాహం జరిగింది. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Tags; Woman attempts suicide due to family disputes.