June 10, 2026
Explore
“అమ్మో ఎండలు.. బడుల ప్రారంభంపై తల్లిదండ్రుల్లో ఆందోళన”

“అమ్మో ఎండలు.. బడుల ప్రారంభంపై తల్లిదండ్రుల్లో ఆందోళన”

June 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా, మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. దీనికి తోడు వడగాల్పులు కూడా వీచడంతో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయనే వార్తలతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు ఈ తీవ్ర ఎండలను ఎలా తట్టుకుంటారు? పాఠశాలలకు వెళ్లే సమయంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందా? అనే సందేహాలు వారిని వెంటాడుతున్నాయి.

ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో, నడిచి లేదా సైకిళ్లపై పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం వేళల్లోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల పనివేళల్లో మార్పులు చేయాలా? లేక ప్రారంభ తేదీని వాయిదా వేయాలా? అనే అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags; “Scorching heat… Parents concerned about school reopening”