ముంబై ముచ్చట్లు:
ముంబై బీచ్‌లో ఒక వింత సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ బోహ్రా అనే వ్యక్తి పోస్టర్ పట్టుకుని కూర్చొని… “మీ బాధలు చెప్పుకోండి” అంటూ ఆహ్వానం ఇస్తున్నాడు.
కానీ ఇది ఫ్రీ కాదు…
చిన్న బాధలు వినడానికి రూ.250
పెద్ద బాధలకు రూ.500
కలిసి ఏడవాలంటే రూ.1000
వినడానికి షాక్‌గా ఉన్నా… చాలామంది నిజంగానే డబ్బులు చెల్లించి తమ కష్టాలు చెప్పుకుంటున్నారని అతడు చెబుతున్నాడు.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది పిచ్చి పని అంటుంటే… మరికొందరు మాత్రం సమాజంలో పెరుగుతున్న ఒత్తిడి, ఒంటరితనానికి ఇది అద్దం పడుతోందని అంటున్నారు.
డబ్బు కోసం అయినా సరే… ఎవరో ఓపికగా వినడం కూడా అవసరమేనేమో!
Tags: Even listening to one’s sorrows comes with a price tag… such is today’s society.