అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశాలపై వారీ సందర్భంగా చర్చించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు చేపట్టాలని, ‘SIR’ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల త్వరిత పరిష్కారమే లక్ష్యంగా టీడీపీ నాయకత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
Tags: TDP leaders met the Collector as a courtesy.