June 9, 2026
Explore
ఏఆర్ డీఎస్పీ రామకృష్ణకు పోలీసుల ఘన వీడ్కోలు

ఏఆర్ డీఎస్పీ రామకృష్ణకు పోలీసుల ఘన వీడ్కోలు

June 9, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

విధి నిర్వహణలో నిబద్ధత ఉంటే ఉన్నత శిఖరాలు వరిస్తాయని ఆర్.ఐ వి.జె. రామకృష్ణ నిరూపించారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు. ఏఆర్ డీఎస్పీగా పదోన్నతి పొంది చిత్తూరుకు బదిలీ అవుతున్న రామకృష్ణకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో పనిచేసిన ఆయన జిల్లాలో అద్భుత సేవలు అందించారన్నారు. బందోబస్తుల సమయంలో ఆయన చూపిన కఠినత్వం కేవలం ఉద్యోగ ధర్మమేనని ఎస్పీ స్పష్టం చేశారు. అనంతరం రామకృష్ణ ఉద్వేగంగా మాట్లాడుతూ.. విధుల పరంగా కఠినంగా ఉన్నా వ్యక్తిగతంగా ఎవరిపై ద్వేషం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags; Police bid a grand farewell to AR DSP Ramakrishna.