June 9, 2026
Explore
ఏపీలో ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్

ఏపీలో ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్

June 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్ జరిగేలా కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ విధానం ద్వారా తొలుత మీరు వెహికల్ కొనగానే డీలర్ వద్దనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

అనంతరం అక్కడి నుంచి రవాణా శాఖకు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు వెళ్తుంది. అధికారులు పరిశీలించి శాశ్వత రిజిస్ట్రేషన్ కు ఆమోదం తెలుపుతారు.

ఒకవేళ అధికారులు 24 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆటోమెటిక్ గా ఆమోదం లభించేలా కొత్త విధానాన్ని రూపొందించారు..

Tags: Vehicle registration in AP within 24 hours from now on.