తంబళ్లపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం, పిచ్చలవాండ్లపల్లి గ్రామం, ఎర్రజేనుపల్లెలో రెండు గ్రామాల ప్రజలు తాగు నీటి కోసం కొట్టుకుంటున్నా పోలీసులు, పంచాయతీ అధికారులు గానీ పట్టించుకోలేదని ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి సాంబ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రజేను పల్లి బాదితులను సిపిఐ నాయకులు పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. శనివారం ఎర్రజేనుపల్లి గ్రామస్థులను, అడవికుంటపల్లి జనం తాగునీటి పైపులు పగలగొట్టి కర్రలు, రాళ్లతో మూకూమ్మడిగా కొట్టడం తెలిసిందే. గాయపడ్డ బాదితులు మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందడం తెలిసిందే… తాగు నీటి కోసం గొడవలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం సోసనీయ మన్నారు. దీనిపై కలెక్టర్, SPకి ఫిర్యాదు చేస్తామన్నారు.
Tags: Resolve Drinking Water Problem in Errajenu Palli: CPI