పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు రవాణాశాఖ పరిధిలోని స్కూల్ బస్సులకు, ఇతర వాహనాలకు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్లు లేకపోతే బస్సులు సీజ్ చేస్తామని ఎంవిఐ సుప్రియ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతిస్కూల్ బస్సును స్వయంగా నడిపి ఫిట్‌నెస్ చెక్‌చేస్తున్నామన్నారు. అలాగే ఫైర్‌సేప్టి, అలారంసిస్టమ్ ఖచ్చితంగా బస్సుల్లో ఉండాలన్నారు. డ్రైవర్లు 60 సంవత్సరాలకు లోపు ఉండాలన్నారు. బస్సులపైన పాఠశాల పేరు, ఫోన్ నెంబర్లు, నాలుగు వైపుల వేయాలని సూచించారు. స్కూల్ బస్సులకు ఎలాంటి రికార్డులు లేకపోయిన ఖచ్చితంగా సీజ్ చేస్తామని, ఇందులో రెండవ ఆలోచన ఉండదని హెచ్చరించారు.
Tags: We will seize school buses if they lack proper documentation.