మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీనివాస రాజు చేస్తున్న అక్రమాలపై వైయస్సార్ విద్యార్థి విభాగం (YSRSU) నాయకులు మదనపల్లె కలెక్టరేట్‌ను ముట్టడించి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొత్త అడ్మిషన్లలో డబ్బులు వసూలు చేయడం, మార్కులు, హాజరు శాతాన్ని తారుమారు చేయడం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ సభలకు హాజరవుతున్నారని ఆరోపించారు. సదరు అధికారిని వెంటనే ఉద్యోగం నుండి తీసేసి విచారణ జరపాలని, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జిల్లా ఉపాధ్యక్షులు మలతోటి నరేష్ హెచ్చరించారు.
Tags: Collectorate besieged over Open School official’s corruption