June 8, 2026
Explore
నగలన్నీ పెట్టుకొని రీల్స్ చేసింది..రాత్రికి దొంగ మొత్తం పట్టుకుపోయాడు..!

నగలన్నీ పెట్టుకొని రీల్స్ చేసింది..రాత్రికి దొంగ మొత్తం పట్టుకుపోయాడు..!

June 8, 2026 | Andhra Pradesh

మధ్యప్రదేశ్ ముచ్చట్లు:

సోషల్ మీడియా వలన ఉపయోగం ఎంతుందో.. కొన్నిసార్లు దాన్ని సరిగ్గా వాడుకోకపోతే అదే మనల్ని ముంచేస్తుంది. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లోని, ఖైద్వా అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఊరికి చెందిన రచన గుజ్జార్ అనే మహిళకు సోషల్ మీడియాలో రీల్స్ చేసి పెట్టడం సరదా.. ఎప్పుడు చూసినా ఆమె లైఫ్ స్టైల్ వీడియోలు చేస్తుండేది. ఖరీదైన చీరలు.. ఒంటినిండా నగలు వేసుకొని.. చేతిలో తన ఐ ఫోన్ చూపిస్తూ రీల్స్ చేసి పెట్టేది. గత మూడు రోజుల క్రితం కూడా కొత్త నగలు వేసుకొని వీడియోలు చేసింది. అదే రోజు రాత్రి ఓ ఫంక్షన్ కి వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లోని నగలన్నీ దొంగలు చోరీ చేశాడు. నగలతో పాటుగా 2 లక్షలు డబ్బు కూడా ఎత్తుకెళ్లిపోయారు. పాపం ఇప్పుడు లబోదిబోమనడం తప్ప చేసేదేమీ లేదుగా..!

Tags; She wore all her jewelry and made Reels… but a thief made off with the lot overnight!