పుంగనూరుముచ్చట్లు:
అల్లనేరేడు కాయల ్యరైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అల్లనేరేడు కాయలను , గింజలను అనేక రోగాలు నయం చేసుకునేందుకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా బిపి, చక్కరవ్యాది, అజీర్ణంలాంటి జబ్బులను నయం చేసుకునేందుకు వాడుతారు. ప్రస్తుతం వర్షాలు సకాలంలో కురవపోవడంతో అల్లనేరేడు పంట సక్రమంగా పండలేదు. దీని కారణంగా ఒకొక్క పండు ధర రూ.1 నుంచి 2 వరకు పలుకుతూ ధరలు చుక్కలంటుతున్నాయి. అలాగే కాయలను కేజి రూ. 200 నుంచి 250ల వరకు విక్రయిస్తున్నారు. చిన్నా పెద్ద తేడాలేకుండ ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా అల్లనేరేడు కాయలను కొనుగోలు చేసి తింటుంటారు. పుంగనూరు, రామసముద్రం, చౌడేపల్లె మండలాల్లో మాత్రమే అల్లనేరేడు చెట్లు అధికంగా ఉన్నాయి. వ్యాపారులు చెట్టులోని పంటను కొనుగోలు చేసి, నిత్యం అవసరమైన మేరకు కాయలుకోసి అమ్మకాలు కొనసాగిస్తుంటారు. రైతులకు సరైన ధరలు రాకపోయినా వ్యాపారులకు మాత్రం అల్లనేరేడు కాయలతో అధికలాభాలు గడిస్తున్నారు.
Tags; Black Plum (Jamun) Raining Money