అమరావతిముచ్చట్లు:
జూన్ 9 నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) పోటీలు ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఎల్లుండి విశాఖలో APL ప్రారంభ మ్యాచ్ జరగనుంది. విశాఖ, కడప, మంగళగిరిలో మ్యాచ్ లు జరుగుతాయి. టోర్నీలో మొత్తం 7 జట్లు లీగ్ విధానంలో ఆడతాయి. జూన్ 30న మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మ్యాచులు చూసేందుకు వచ్చే విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు.
Tags: Andhra Premier League (APL) begins on June 9.